13న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో డిసెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కా రం అయ్యేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూ చించారు.ఆ సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రితో కలసి జిల్లా న్యాయమూర్తులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్‌పై సమీక్షించారు. కోర్టులలో పెండింగ్ ఉన్న సివిల్, రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులకు సూచించారు. ప్రతి రోజూ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్‌లను చేసి ఎక్కువ కేసులు పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించి లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు. కక్షిదారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


