30 ఎకరాలకు 600 బస్తాలే
4 ఎకరాలు సొంతంగా, 26 ఎకరాల భూమిని ఎకరాకు 14 బస్తాల ప్రకారం కౌలుకు తీసుకుని వరి సాగు చేశాం. దాదాపు రూ.9 లక్షలకు పెట్టుబడులకే అయ్యింది. ఎకరాకు 40 లేదా కనిష్టంగా 35 బస్తాలు పండినా 30 ఎకరాలకు వెయ్యి నుంచి 1,200 బస్తాల దిగుబడి రావాలి. అయితే 600 బస్తాలు మాత్రమే వచ్చింది. ఈ లెక్కన 500 బస్తాల వరకు నష్టపోయినట్లయింది. ఎల్లెల్సీ కింద ఈ ఏడాది ఒక్క కారుకు మాత్రమే సాగు నీరిచ్చారు. అప్పులు ఎలా తీర్చాలో పాలుపోవడం లేదు. – పింజరి ఆలంబాషా, రైతు
రైతులు పండించిన ధాన్యానికి రూ.3 వేల మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎల్లెల్సీ కింద ఈ ఏడాది ఒక్క కారుకు మాత్రమే సాగు నీరిచ్చారు. చాలా మంది రైతులకు దిగుబడి అంతంతమాత్రమే ఉంది. తెగుళ్లతో చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు 25 బస్తాల దిగుబడి కూడా రాలేదు. ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం.
– సిందువాళ కృష్ణయ్య, రైతు, హొళగుంద
30 ఎకరాలకు 600 బస్తాలే


