రైతుల ఆదాయం రెట్టింపునకు ప్రణాళికలు
పాణ్యం: రైతులు ఆదాయం రెట్టింపునకు తగిన ప్రణాళికలు రూపొందించాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ శుక్రవారం పాణ్యంలో ఏపీఎంలతో సమావేశం నిర్వహించింది. కార్యక్రమానికి హాజరైన పీడీ మాట్లాడుతూ.. జిల్లాలో రైతు ఉత్పిత్తిదారుల సంస్థలను బలోపేతం చేస్తూ అదే విధంగా ప్రణాళికలు రూపొదించాలన్నారు. ఇందుకు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధకశాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్ర మాట్లడుతూ రైతు ఉత్పిత్తిదారుల సంఘాలు ప్రభు త్వ రాయితీలను ఉపయోగించుకోవాలన్నారు. ఉద్యావనశాఖ అధికారి నాగ రాజు మాట్లాడుతూ.. రైతు సంఘంలో ఉన్నటువంటి ప్రతి రైతు పండ్లు, పూలు తోటలు సాగు చేసే వారికి ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందన్నారు. నాబార్డు ఏజీఎం కార్తీక్, జిల్లా జాయింట్ వ్యవసాయ అధికారి వెంటకేశ్వర్లు మాట్లాడుతూ ఉత్పత్తిదారుల సంస్థలో ఉండే రైతులకు నాబార్డు నుంచి సహకారం అందుతుందన్నారు. రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణపై దృష్టి సారించాలని పశుసంవర్దకశాఖ అధికారి పుల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో హీఫర్ సంస్థ ప్రతినిధులు రవికాంత్, జిల్లా డీపీఎం నాయక్, ఎఫ్‌పీఓ డీపీఎం సురేష్, మరియు 12 మండలాల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, సీసీలు, ఐఎఫ్‌సీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


