సెల్ ఫోన్ల దొంగల అరెస్ట్
డోన్ టౌన్: సెల్‌ఫోన్లను అపహరించే ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా స్థానిక సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం నిందితుల వివరాలు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారు జామున పట్టణ సమీపంలోని జాతీయ రహదారి మ్యాక్స్4 వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు మైనర్లు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా 21 సెల్ ఫోన్లు గుర్తించి విచారణ చేపట్టారు. డోన్ పట్టణానికి చెందిన ఇద్దరు బాలులుహైదరాబాద్‌లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫోన్లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వాటిని వారి తండ్రులు రాంబాబు, ఎంకన్నకు అప్పగిస్తే విక్రయించేవారని తెలిసింది. స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల విలువ సుమారు రూ.1.05 లక్షలు ఉంటుందన్నారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో రూరల్ స్టేషన్ సీఐ సీఎం రాకేష్, ప్యాపిలి సీఐ వెంకట్రామిరెడ్డితో పాటు సబ్ డివిజన్ ఎస్‌ఐలు శరత్‌కుమార్‌రెడ్డి, మధుసూదన్, నాగార్జున, నాగరాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.


