గ్రాసం కరువు.. పశు పోషణ బరువు! | - | Sakshi
Sakshi News home page

గ్రాసం కరువు.. పశు పోషణ బరువు!

Nov 28 2025 8:45 AM | Updated on Nov 28 2025 8:45 AM

గ్రాస

గ్రాసం కరువు.. పశు పోషణ బరువు!

గడ్డిని కొనాల్సిందే..

గడివేముల: పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుపాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు పశుగ్రాసం కొ రత ఏర్పడింది. పశువుల మేతకు వరిగడ్డిని కొనాలంటే ట్రాక్టర్‌ గడ్డి ధర రూ.3 వేలకు పైగా పలుకుతోంది. అంత డబ్బుతో గడ్డిని కొనలేక పాడి రైతులకు పశు పోషణ బరువైంది. పాడి పశువులకు మేత సరిగాలేక పాల దిగుబడి కూడా తగ్గిపోయింది. దీంతో పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

ఇవీ కష్టాలు..

నంద్యాల జిల్లాలో మొత్తం 4.33 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 1,51,452 ఎకరాల్లో వరి సాగు చేశారు. కేసీ కెనాల్‌, ఎస్బార్బీసీ, తెలుగుగంగ కింద విస్తారంగా వరి సాగు అయ్యింది. మోంథా తుపాన్‌తో కురిసిన భారీ వర్షాలతో వరి, మొక్కజొన్న పంటలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. దాదాపు 1.02 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు మొదట అంచనాలు వేశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లు కారణంగా 11,448 హెక్టార్లలో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నివేదిక పంపారు. వరి పంటకు నష్టం వాటిల్లడంతో పశుగ్రాసానికి కొరత ఏర్పడింది. మొక్కజొన్న చొప్ప దొరకని దుస్థితి నెలకొంది.

గడ్డి సరిగ్గా లేకున్నా...

పడిపోయిన వరిని రైతులు కోస్తున్నారు. గడ్డి కోసం జిల్లాలోని పాడి రైతులతోపాటు అనంతపురం, ప్రకాశం జిల్లా గిద్దలూరు, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి వస్తున్నారు. శిరవెళ్ల, దొర్నిపాడు, గోస్పాడు, మహానంది, బండిఆత్మకూరు, గడివేముల, బనగానపల్లె మండలాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఏ పొలంలో చూసినా వరి కోత మిషన్లు రంగంలోకి దిగి పంట కోతలను జరుపుతున్నాయి. భారీ వర్షాలతో గడ్డి సరిగ్గా లేకున్నా డిమాండ్‌ వస్తోంది. దానిని కొనుగోలు చేసి ట్రాక్టర్లు, లారీల ద్వారా తీసుకుని వెళ్తున్నారు. ఒక ఎకరాకు లభించే వరిగడ్డికి రూ. 3 వేల వరకు ధర వస్తోంది. చైన్ల మిషన్లతో అయితే గడ్డి కొంత పాడవడంతో చక్రాల్లాగా బేళ్లు కడుతున్నారు. అధిక శాతం బేళ్లను చుట్టుకొని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కొక్క బేలు సుమారు 20 నుంచి 30 కిలోల వరకు ఉంటుంది. ఒక్కొక్క బేలు ధర 70 నుంచి 90 రూపాయల వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు.

నాకు ఐదు బర్రెలు, ఎద్దులు ఉన్నాయి. గత కొన్ని రోజుల కిందట కురిసిన మోంథా తుఫాన్‌ కారణంతో వరిమళ్లు దెబ్బతిన్నాయి. పశువులకు మేత కోసం వరిగడ్డి కొనాలంటే ఎకరా రూ.3 వేల దాకా పలుకుతోంది. దీంతో చుట్టు మండలాల నుంచి వరిగడ్డిని కొనాల్సి వస్తుంది. పశువులకు మేత దొరకని పరిస్థితి నెలకొంది.

–పైపాలెం ఉశేని, గడివేముల

తుపాన్‌తో దెబ్బతిన్న వరి

దొరకని పశుగ్రాసం

ఎకరా వరి గడ్డి ధర రూ. 3వేలు

పాడి రైతుకు తప్పని తిప్పలు

గ్రాసం కరువు.. పశు పోషణ బరువు!1
1/1

గ్రాసం కరువు.. పశు పోషణ బరువు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement