తాత్కాలిక టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో పార్ట్ టైం(తాత్కాలికం) టీచర్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నటేకూరులో జేఎల్ మ్యాథ్స్ –1, కోవెలకుంట్లలో జేఎల్ ఫిజిక్స్ –1, లక్ష్మీపురంలో టీజీటీ హిందీ –1 , వెల్దుర్తిలో టీజీటీ ఫీహెచ్‌వై సైన్స్–1, కోవెలకుంట్ల టీజీటీ పీహెచ్‌వై సైన్స్–1 పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా టెట్ అర్హత ఉండి, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, బీఎడ్ పూర్తి చేసి ఉండాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 27 నుంచి డిసెంబర్ 1లోగా కార్యాలయ పనివేళల్లో జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయంలో అందించాలన్నారు. డిసెంబర్ 2న డెమో డీసీఓ సమక్షంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దిన్నెదేవరపాడులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో డెమో నిర్వహిస్తామన్నారు. వివరాలకు 9441192673 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
కర్నూలు కల్చరల్: కర్నూలు ఓల్డ్‌సిటీలోని దక్షిణ షిరిడీ సాయిబాబా దేవస్థానానికి 1.250 కేజీల వెండి కిరీటాన్ని భక్తులు బహూకరించారు. బొల్లవరం గ్రామానికి చెందిన ఈశ్వరయ్య, పద్మావతి కుటుంబ సభ్యులు గురువారం వెండి కిరీటం అందించగా ఆలయ పాలక మండలి తరపున ప్రధాన కార్యదర్శి మహాబలేష్ స్వీకరించారు.
29న ‘ప్రత్యేక’ వైద్యశిబిరం
నంద్యాల(న్యూటౌన్): ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ఉచితంగా సహాయ ఉపకరణాలు అందిచేందుకు ఈనెల 29న నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ డీఈఓ శంకర్‌ప్రసాద్, ఎంఈఓ బ్రహ్మం నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైద్య శిబిరానికి నంద్యాల నియోజకవర్గంలోని నంద్యాల, గోస్పాడు, పాణ్యం, మహానంది, బండిఆత్మకూరు మండలాలకు చెందిన మానసిక, శారీరక, వినికిడి, బహుళ వైకల్యం ఉన్న 18 సంవత్సరాల్లోపు పిల్లలందరూ హాజరు కావచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, సదరన్ సర్టిఫికెట్, రెండు ఫొటోలు, యూడీ ఐడీ కార్డు తప్పక తీసుకొని రావాలని తెలిపారు.


