రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామస్థాయిలో ఒకవైపు మూగజీవులకు వైద్య సేవలు అందిస్తూ... మరోవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్‌ను కించపరిచే విధంగా ప్రకటనలు చేస్తున్న రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పీవీ లక్ష్మయ్యపై చర్యలు తీసుకోవాలని ఏపీ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ పెడరేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అనే పదం వాడే అర్హత నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్‌కు లేదని అవమానకరంగా మాట్లాడటం సరికాదన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని గోకులం సమావేశ మందిరంలో జీవీవో, వీఎల్‌వో, ఎల్‌ఎస్‌ఏ కార్యావర్గ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పశుసంవర్ధక శాఖలో ఏహెచ్‌ఏ పోస్టుల భర్తీ పారదర్శకంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే జరిగిందని, ఎంపికై న వారికి డిపార్టుమెంటు అధికారులే డివార్మింగ్, వాక్సినేషన్, కృత్రిమ గర్భధారణ తదితర వాటిల్లో శిక్షణ ఇచ్చారన్నారు. అయితే, దొంగ సర్టిఫికెట్‌లతో ఉద్యోగాలు పొందారని కించపరచడం తగదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో అధికారులు, నాన్ గెజిటెడ్ కేడర్ల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కౌన్సిల్ చైర్మన్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ హేమంత్‌కుమార్‌కు వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో వివిద సంఘాల నాయకులు జనార్ధన్‌రెడ్డి, గంగన్న,ఆయేశ్వరీ, హనుమంతు, సులోచన, సుమలత తదితరులు పాల్గొన్నారు.


