తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం
చిన్న వయస్సులో గర్భం దాలిస్తే బాలికకు రక్తహీనత ఏర్పడటం, కడుపులో బిడ్డ సరిగ్గా ఎదగకపోవడం, అబార్షన్లు జరుగుతాయి. అమ్మాయికి పెల్విన్‌బోరాన్ వృద్ధి చెందక ముందే వివాహం చేయడం వల్ల వారికి ప్రసవం కష్టమై సిజేరియన్ చేయాల్సి వస్తుంది. బీపీ, ఫిట్స్, నెలలు నిండకముందే బిడ్డ జన్మించడం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొన్నిసార్లు అవిటితనం ఉన్న పిల్లలు జన్మించే అవకాశం ఉంది.
–డాక్టర్ ఎస్.సావిత్రి, గైనకాలజీ హెచ్‌వోడీ, కర్నూలు పెద్దాసుపత్రి
బాల్య వివాహాలతో చాలా మంది కౌమార దశ పూర్తి గాకుండానే గర్భం దాలుస్తున్నారు. ఈ కారణంగా వారికి నెలలు నిండకుండా శిశువు జన్మించడం, సరైన సమయంలో జన్మించినా బరువు తక్కువగా ఉండటం జరుగుతుంది. ఇలాంటి పిల్లలకు బుద్ధిమాంద్యం, చురుకుగా లేకపోవడం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. తల్లులకు ప్రసవం తర్వాత తల్లిపాలు సరిగ్గా పడవు. దీంతో శిశువులు పలుమార్లు ఇన్‌ఫెక్షన్లకు గురై అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. – డాక్టర్ అమరనాథరెడ్డి,
చిన్నపిల్లల వైద్యుడు, కర్నూలు
జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా ఐసీడీఎస్ శాఖతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నాయని తెలిస్తే స్థానిక పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బందితో కలిసి వెళ్లి పెళ్లి జరగకుండా చూస్తున్నాం. అప్పటికే వివాహం జరిగి ఉంటే ఆమె టీనేజీలో గర్భం దాల్చకుండా ఆరోగ్య సిబ్బందిచే అవగాహన కల్పిస్తున్నాం. టీనేజీలో గర్భం దాల్చడం వల్ల వచ్చే దుష్పరిణాల గురించి బాలికలకు, వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నాం.
–డాక్టర్ ఎల్.భాస్కర్, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ
తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం
తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం


