ప్రైవేట్ రాయల్టీ చెక్ పోస్టులు ఎత్తేయాలి
బనగానపల్లె: రాయల్టీ వసూలును ప్రైవేట్‌కు అప్పగించడంతో పాటు ప్రైవేట్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంపై నాపరాతి పరిశ్రమ యజమానులు, కార్మికులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. రాయల్టీ వసూలులో పాత పద్ధతిని కొనసాగించి, ప్రైవేట్ చెక్‌పోస్టులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బనగానపల్లె మండలం పలుకూరు రాయల్టీ చెక్‌పోస్టు సమీపంలోని అడ్డరోడ్డు వద్ద వారు ఆందోళనకు దిగారు. నాపరాళ్ల లోడ్‌తో ఉన్న ట్రాక్టర్లను ఆపివేసి నిరసనకు దిగడంతో బనగానపల్లె–కర్నూలు రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇప్పటికే ప్రభుత్వ తీరుతో కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో రాయల్టీ పెంచి వసూలు బాధ్యతను ప్రైవేట్‌కు అప్పగించడం సరికాదంటూ చెక్‌పోస్టుషె డ్డ్, ఫర్నీచర్‌ను పక్కకు తోసేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్‌రెడ్డి, నందివర్గం ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య పోలీసు బందోబస్తుతో అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ప్రైవేట్ రాయల్టీ చెక్ పోస్టులు ఎత్తేయాలి


