ఆధునిక వైద్యపరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
గోస్పాడు: వైద్యులు ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని యూరాలజీ వైద్యులు డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ సదస్సు నంద్యాల పట్టణంలో శనివారం సాయంత్రం అటహాసంగా ప్రారంభమైంది. నంద్యాల,కర్నూలు జిల్లాల యూరాలజీ సంఘాల సంయుక్త నిర్వహణలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. తొలి రోజు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మూత్రపిండాలు, మూత్రశయ, మూత్రనాల, జననేంద్రియ జబ్బులకు అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ యూరాలజీ వైద్యులు డాక్టర్ విక్రమ సింహారెడ్డి, దక్షిణ భారత యూరాలజీ వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ చంద్ర మోహన్, ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జగదీశ్వర్, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ జై బాబు రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ దాసరి రమేష్, డాక్టర్ విక్రమసింహారెడ్డి, డాక్టర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


