సోమశిల నుంచి శ్రీశైలానికి టూరిజం లాంచ్
శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ ఏర్పాటుచేసిన లాంచ్ సోమశిల జలాశయం నుంచి కష్ణానదిపై శ్రీశైలానికి(120 కిలోమీటర్లు) శనివారం రాత్రి 7 గంటలకు చేరుకుంది. ఈ ఏడాదిలో టూరిజం శాఖ లాంచ్ ప్రయాణాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి. శనివారం ఉదయం సుమారు 11 గంటలకు సోమశిల నుంచి ప్రారంభమైన ఈ జల విహారయాత్రలో 66 మంది ప్రయాణికులు పాల్గొన్నట్లు టూరిజం అధికారులు తెలిపారు. ప్రయాణ సమయంలో లాంచ్‌లో ఉన్నవారికి టీ, స్నాక్స్, భోజన ఫలహారాది సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అలాగే వారికి శ్రీశైలం చేరిన తర్వాత వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని వెల్లడించారు అన్నారు.
జల విహారయాత్రకయ్యే ఖర్చు
సోమశిల నుంచి శ్రీశైలానికి కృష్ణానది మార్గంలో లాంచ్(వారంలో ఒక్కరోజు) ద్వారా ప్రయాణం చేయడానికి పెద్దలకు రాను పోను రూ.3వేల టికెట్ నిర్ణయించారు. అలాగే పిల్లలకు రూ.2400. ఒకవైపు ప్రయాణానికై తే పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రరూ.1600 వసూలు చేస్తున్నారు. శనివారం సాయంత్రం శ్రీశైలం చేరుకున్న తర్వాత వారికి వసతి, భోజన. ఫలహారాది సౌకర్యలు కల్పిస్తారు. స్వామి, అమ్మ వార్ల దర్శనానంతరం ఆదివారం ఉదయం తిరిగి 9 గంటలకు లాంచ్ ప్రయాణం ప్రారంభమై అదే రోజు సాయంత్రానికి సోమశిలకు చేరుకుంటుంది.


