● మహిళా మృతి
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
నందికొట్కూరు: ద్విచక్రవాహనానికి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందారు. నందికొట్కూరు పట్టణంలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్నూలు వైపు వెళుతుంది. నందికొట్కూరులోని హజీనగర్‌లో నివసించే షేక్ ఆఫ్రీన్ (26) అనే మహిళ పోలీసు స్టేషన్‌కు సమీపంలోని పెట్రోల్ బంకులో పెట్రోల్ వేయించుకొని బైక్‌పై రోడ్డుమీదకు వస్తున్నారు. ఆత్మకూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆఫ్రీన్‌ను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో మెస్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. విధులకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. తండ్రి షేక్ అబ్దుల్ ఆలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


