ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం
కొలిమిగుండ్ల: కల్వటాల సమీపంలోని రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఉయ్యాలవాడ మండలం అల్లూ రు గ్రామానికి చెందిన నక్కా గురుప్రసాద్ (30) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీలో లారీలో సిమెంట్ బస్తాలు నింపాక పైకి ఎక్కి పట్టుకునే సమయంలో జారి కింద పడటంతో గాయపడ్డాడు. చికిత్స కోసం కొలిమిగుండ్ల పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తాడిపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేక రించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.


