రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతుల అభ్యున్నతికి రాష్ట్ర
నేలవాలిన వరి పైరును చూపుతున్న రైతు(ఫైల్)
ఉచిత పంటల బీమాకు మంగళం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లు ఉచిత పంటల బీమాను అమలు చేసింది. నోటిఫైడ్ పంటలు ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు.. బీమా వర్తించింది. ఐదేళ్లలో ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకపోయినప్పటికీ ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.2 లక్షల వరకు లబ్ధి కలిగింది. కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని పక్కన పెట్టేసింది. ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే బీమా అనే విధానాన్ని అమలు చేసింది. 2025 ఖరీఫ్ సీజన్‌లో కేవలం 38,918 మంది రైతులు మాత్రమే పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించారు. మిగిలిన రైతులకు పంటల బీమా లేకుండా పోయింది.
అంచనా.. అంతా వంచన!
కర్నూలు జిల్లాలో పంట పత్తి, వేరుశనగ, వరి ప్రధాన పంటలు. అధికారిక లెక్కల ప్రకారం ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన అధిక వర్షాలతో 397.58 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. మోంథా తుపానుతో కర్నూలు జిల్లాలో ఎలాంటి పంట నష్టం జరుగలేదని వ్యవసాయ యంత్రాంగం ప్రకటించింది. నంద్యాల జిల్లాలో మాత్రం 40 వేల హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నాయని వ్యవసాయ యంత్రాంగం నిర్ధారించింది. అయితే టీడీపీ నేతలు సూచనల మేరకు వ్యవయసాయ అధికారులు అంచనాను మార్చి 11,446.7 హెక్టార్లలోనే పంటలు దెబ్బతిన్నట్లు తేల్చారు. కంది, పెసర, మినుము, మొక్కజొన్న, వరి, పత్తి, సోయాబీన్, బీన్స్, వేరుశనగ, జనపనార పంటలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు చూపారు. కొండంత నష్టం జరిగితే చూపింది నామమాత్రమేనన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆదుకోని అన్నదాత సుఖీభవ
రబీలో పంటల బీమాకు ఎగనామం
ఎక్కడా కనిపించని యాంత్రీకరణ
అనావృష్టితో పంటలు ఎండిపోయినా
పరిహారం శూన్యం
‘మోంథా’ ముంచినా స్పందించని
రాష్ట్ర ప్రభుత్వం
తూతూ మంత్రంగా నష్టం అంచనా!


