రైతులకు అన్యాయం
నేను ఐదు ఎకరాల్లో పత్తి, నాలుగు ఎకరాల్లో కంది సాగు చేశా. వరుసగా వర్షాలతో పత్తి పంట పూర్తిగా దెబ్బతినింది. కాయలు కుళ్లిపోయాయి. మామూలుగా అయితే ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కాని కేవలం 2–3 క్వింటాళ్ల వరకే వచ్చింది. మద్దతు కొనుగోళ్లు లేకపోవడంతో క్వింటాలు రూ.6500 ధరతో అమ్ముకున్నాం. ఉచిత పంటల బీమా లేకపోవడంతో రైతులకు అన్యాయం జరిగింది. మోంథా తుపాను ప్రభావంతో కందిలో పూత పూర్తిగా రాలిపోవడంతో దిగుబడులపై ఆశలు లేకుండా పోయాయి.
– ఏ.రాజశేఖర్, మామళ్లకుంట, తుగ్గలి మండలం
నాకు ఐదు ఎకరాలు సొంత భూమి ఉండగా 20 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశా. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టా. 19 ఎకరాల్లోని వరి దెబ్బతినింది. ఎకరాకు కోత కోయడానికే రూ.3500 ఖర్చు వస్తోంది. దిగుబడి ఎకరాకు 18 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కౌలు కింద 11 క్వింటాళ్ల వరకు ధాన్యం ఇవ్వాల్సి ఉంది. అప్పులే తప్ప ఏమీ మిగిలే అవకాశం లేకుండా పోయింది.
– సీమ రామిరెడ్డి, బండిత్మకూరు
రైతులకు అన్యాయం


