నురగలో నేనుంట!
పొలాల వెంట, పొలం గట్ల వెంబడి ఉన్న గడ్డి పరకల మీద, మొక్కల మీద జిగటగా ఓ నురగ కనిపిస్తోంది. వీటిని చూస్తే ఎవరైనా ఉమ్మేసి వెళ్లారో ఏమో అన్నట్లు అనిపిస్తోది. అయితే వాటి అసలు పేరు స్పిటిల్ బగ్ అంటారు. చిన్న కీటకాలు మొక్కల కాండం వెంట సృష్టించే నురుగే ఇది. గాలిని ద్రవ విసర్జనలో కలపడం ద్వారా నురుగు మిశ్రమాన్ని ఉత్పత్తి చేస్తాయి. కొన్ని కీటక జాతులు నిమిషానికి సుమారు 100 బుడగలను ఉత్పత్తి చేస్తుందని కీటకశాస్త్రవేత్తలు చెప్పారు. స్పిటిల్ బగ్ మొక్కల్లో ఉన్న తేమను పీల్చుకుంటూ నురగ సృష్టిస్తూ ఎండ, ఇతర కీటకాల నుంచి రక్షణ కోసం కవచంలా ఏర్పరచుకుంటాయని వన్యప్రాణి ప్రేమికుడు, హైటికాస్ సంస్థ ప్రతినిధి దూపాడు శ్రీధర్ తెలిపారు. – మహానంది


