ప్యవ‘సాయం’పై నిలదీత | - | Sakshi
Sakshi News home page

ప్యవ‘సాయం’పై నిలదీత

Nov 8 2025 7:28 AM | Updated on Nov 8 2025 7:28 AM

ప్యవ‘

ప్యవ‘సాయం’పై నిలదీత

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆందోళన

కర్నూలు(అర్బన్‌): ‘‘వ్యవసాయం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో ఈ క్రాప్‌ బుకింగ్‌ చేయలేదు, అధిక వర్షాలు, తుఫాన్ల వల్ల నష్టపోయిన పంటల ఎన్యుమరేషన్‌ కూడా పూర్తి కాలేదు. మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లికి నేటికీ అనేక మందికి నగదు జమ కాలేదు. నంద్యాల జిల్లాలో పూర్తి స్థాయిలో నష్టపోయిన మొక్కజొన్నకు నష్ట పరిహారం అందిస్తారా, లేదా? మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?’’ అని జెడ్పీటీసీ, ఎంపీపీలు తీవ్ర అందోళనను వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు డాక్టర్‌ ఎ.సిరి, రాజకుమారి గనియా, కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే నందికొట్కూరు, కొత్తపల్లి, ఓర్వకల్‌, జూపాడుబంగ్లా జెడ్పీటీసీలు షేక్‌ కలీమున్నీసా, సుధాకర్‌రెడ్డి, రంగనాథ్‌గౌడ్‌, జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మొక్కజొన్న పూర్తి స్థాయిలో నష్టపోయిందని, వెంటనే నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు మిగిలిన మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గనియా మాట్లాడుతూ మోంథా తుఫాను ప్రభావంతో నంద్యాల జిల్లాలో 11,448 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఇందులో 4297 హెక్టార్లలో మొక్కజొన్న, 6384 హెక్టార్లలో వరి పంటలు నష్టపోయినట్లు తెలిపారు. నష్ట పరిహారం నివేదికలను ప్రభుత్వానికి పంపామన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సోమవారం నాటికి స్పష్టత రానుందని చెప్పారు. సమావేశంలో రూ.5.86 కోట్ల అంచనాతో 137 పనులకు ఆమోదం తెలిపారు.

త్వరితగతిన చెరువులు నింపండి:

జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో హంద్రీనీవా నీటితో చెరువులను పూర్తి స్థాయిలో నింపాలని జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి కోరారు. ఇప్పటి వరకు ఎన్ని చెరువులను నింపారని ఆయన ప్రశ్నించారు. మొత్తం 73 చెరు వుల్లో ఇప్పటి వరకు 45 చెరువులను పూర్తి స్థాయిలో నింపామని, మిగిలిన వాటిని పాక్షికంగా నింపినట్లు ఇరిగేషన్‌ ఎస్‌ఈ బాల చంద్రారెడ్డి సమాధానమిచ్చారు. తుంగభద్ర దిగువ కాలువకు ప్రస్తుత రబీ సీజన్‌లో నీటిని విడుదల చేయలేమని టీబీ డ్యాం అధికారు లు స్పష్టం చేశారని, ప్రస్తుత ఖరీఫ్‌కు కూడా డిసెంబర్‌ 20వ తేదీ వరకు మాత్రమే నీరు విడుదల య్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇరిగేషన్‌ అధికారులకు ముందు చూపు లోపించడం వల్ల వర్షాలు బాగా కురుస్తున్నా, నీటిని నిల్వ చేసుకోలేకపోతున్నామన్నారు.

త్వరలో ఉల్లి రైతుల బకాయిలు విడుదల: డాక్టర్‌ ఎ.సిరి, కర్నూలు జిల్లా కలెక్టర్‌

మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లికి సంబంధించి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.8 కోట్లు త్వరలో విడుదల కానున్నాయి. ఉల్లి కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు రైతులకు రూ.10 కోట్లు జమ అయ్యాయి. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా పత్తి కొనుగోలుకు సంబంధించి తేమ 13, 14 శాతం ఉన్నా కొనుగోలు చేసే విధంగా మిల్లులకు ఆదేశాలు జారీ చేశాం.

మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి, సమావేశానికి హాజరైన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు

చిత్తశుద్ధిలేని మంత్రులు, ప్రజాప్రతినిధులు

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రజలు, ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి అవసరమైతే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు వేదికై న జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఒకరు మినహా మిగిలిన ప్రజా ప్రతినిధులందరూ గైర్హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, కేవలం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. వీరి గైర్హాజరును చూస్తే ప్రజా సమస్యలపై వీరికి ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో తెలియజేస్తుంది.

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నీటితో

త్వరితగతిన చెరువులు నింపండి:

జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి

రబీకి ఎల్‌ఎల్‌సీ నీరు రాదు:

ఇరిగేషన్‌ ఎస్‌ఈ బాల చంద్రారెడ్డి

ఖరీఫ్‌కు కూడా డిసెంబర్‌ 20వ తేది

వరకు మాత్రమే నీళ్లు

ప్యవ‘సాయం’పై నిలదీత1
1/1

ప్యవ‘సాయం’పై నిలదీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement