ఇథనాల్ ట్యాంకర్ బోల్తా
ఆలూరు రూరల్: అదుపుతప్పి ఇథనాల్ ట్యాంకర్ బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. గురువారం అర్ధరాత్రి ఆలూరు సమీపంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హైవే–167 లో ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర రాష్ట్రంలోని సోలాపూర్ నుంచి అనంతపురం జిల్లా గుంతకల్లుకు ఇథనాల్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ (లారీ) అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఇథనాల్ పేలుడు స్వాభావం కలిగిన ద్రవం కావడతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫైర్ సిబ్బందిని పిలిపించారు. రాత్రంతా సంఘటన స్థలంలో ఉండి రాకపోకలు సాగిస్తున్న వాహనదారులను అప్రమత్తం చేశారు. ఉదయం క్రేన్‌ల సహాయంతో లారీని సురక్షితంగా పక్కకు తీసి పంపించారు.
కూలీల వలస బాట
హొళగుంద: మండల పరిధిలోని గజ్జహళ్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు చెందిన కూలీలు శుక్రవారం రాత్రి వలస బాట పట్టారు. దసరా పండుగ ముగియడం, గ్రామంలో వ్యవసాయ పనులు తక్కువగ ఉండడంతో కూలీలు తెలంగాణ రాష్ట్రం జహిరాబాద్‌కు, ఇతర ప్రాంతాలకు వలసెళ్లారు. అక్కడ పత్తి, మిరప పొలంలోని కోత పనులు చేసేందుకు వెళ్తున్నట్లు కూలీలు తెలిపారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడం, ఉపాధి పనులు జరగకపోవడం, జరిగినా కూలీ గిట్టుబటు కాకపోవడంతో వలస బాట పట్టినట్లు కూలీలు తెలిపారు.
యువకుడి దుర్మరణం
డోన్ టౌన్: బైకును లారీ ఢీ కొనడంతో విజయరాజు(24)అనే యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన డోన్ పట్టణ సమీపంలోని యు.కొత్తపల్లె జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుత్తి మండలం బేతపల్లె గ్రామానికి చెందిన విజయరాజు సెట్రింగ్ పనులు చేస్తున్నాడు. బైకుపై డోన్‌కు వచ్చి గ్రామానికి తిరిగి వెళుతుండగా కర్నూలు నుంచి ఆనంతపురం వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన విజయరాజును స్థానికులు చికిత్సల నిమ్మిత్తం డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుని తండ్రి చిట్టిబాబు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇథనాల్ ట్యాంకర్ బోల్తా
ఇథనాల్ ట్యాంకర్ బోల్తా


