ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ట్యాంక్ బండ్ రోడ్డులో శుక్రవారం ఆర్‌ఎస్ ల్యాబ్ టెక్నీషియన్ కృపాసాగర్(40) ల్యాబ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు...లక్ష్మీపేటకు చెందిన రత్నమ్మ కుమారుడు కృపాసాగర్(40) ట్యాంక్ బండ్ రోడ్డు గుడ్‌షెప్పర్డ్ స్కూల్ ఎదురుగా ఎస్‌ఆర్ ల్యాబ్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇదే ల్యాబ్‌లో పనిచేస్తున్న నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన మేసయ్య, దేవమణిల కుమార్తె సుభాషిణిని ఈ సంవత్సరం ఆగష్టులో ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యభర్తలు ల్యాబ్‌లో కాపురం ఉంటున్నాడు. తిరుపతికి వెళ్తున్నాని భార్యను పుట్టింటికి పంపించాడు. అయితే భార్య మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తుండగా లిప్ట్ చేయకపోవటంతో అనుమానం వచ్చి చూడగా ఇంటికి లోపల లాక్ వేసి ఉండటంతో పగలగొట్టి చూడగా ఫ్యాన్ ఉండే ఇనుప కడ్డీకి పంచ, టవల్ జాయింట్ చేసుకొని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కలుగోట్ల రోడ్డులోని అరుణ అనే మహిళ వేధింపులు తాళలేకనే తన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య సుభాషిణి ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఏఎస్‌ఐ కిష్టప్పనాయక్, కానిస్టేబుల్ రంగన్న పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని టౌన్ సీఐ వి.శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు.


