పింఛన్ వస్తుందా.. రాదా?
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు దస్తగిరి. యర్రగుడి గ్రామం. ఇటీవలనే తొంభై ఏళ్లు పూర్తయ్యాయి. రెండేళ్ల క్రితం వృద్దుడి భార్య దస్తగిరిమ్మ మృతి చెందారు. అమెకు పింఛన్ వస్తుండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు దాటుతున్నా నేటికీ కొత్త పింఛన్‌ల నమోదు చేసేందుకు వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. వృద్ధుడు దస్తగరి తొమ్మిది పదుల వయసులో కూడా టైలరింగ్ చేస్తున్నాడు. తనకు ఇంకెప్పుడు పింఛన్ వస్తుందని, చచ్చే లోపు అయినా ఇస్తారో, లేదో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– కొలిమిగుండ్ల


