గల్లంతైన వ్యక్తి మృతి
పాములపాడు: చెలిమిల్ల గ్రామం వద్ద సుద్దవాగులో ఈ నెల 28న గల్లంతైన వ్యక్తి శవమై కనపించాడు. మూడు రోజుల క్రితం కొత్తపల్లి మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరయ్య(46), వెంకటేష్ బైక్‌పై పాములపాడు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా నీటి ప్రవాహానికి అదుపు తప్పి కింద పడ్డారు. నీటిలో కొట్టుకుపోతున్న వెంకటేష్‌ను చెలిమిల్ల గ్రామానికి చెందిన యువకులు కాపాడగా నాగేశ్వరయ్య అనే వ్యక్తి గల్లంతైన విషయం విధితమే. మూడు రోజులుగా ఉధృతంగా ఉన్న నీటి ప్రవాహంలో ఎస్‌ఐ సురేష్‌బాబు ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, మత్స్యకారులు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం సమయంలో ఈతవనం వద్ద నాగేశ్వరయ్య మృత దేహం లభ్యమైంది. మృతుడికి అతనికి భార్య లక్ష్మీదేవి, కుమారుడు నాగమల్లేష్, కూతురు రాజేశ్వరి ఉన్నారు. ఈ నెల 28న మందుల కోసం పాముల పాడుకు వచ్చినట్లు బంధువులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామా నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపారు.


