గురువా.. కనవా! | - | Sakshi
Sakshi News home page

గురువా.. కనవా!

Nov 2 2025 9:26 AM | Updated on Nov 2 2025 9:26 AM

గురువ

గురువా.. కనవా!

గురురాఘవేంద్ర ప్రాజెక్టును పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

పనిచేయని జీఆర్‌పీ పంపుహౌస్‌లు

ధ్వంసమైన ట్రాన్స్‌ఫార్మర్‌లు

వెలవెలబోతున్న ఎత్తిపోతల పథకాలు

మరమ్మతులకు అందని నిధులు

దారుణం

మరమ్మతులు చేయాలి

అన్నదాతల వలస బాట

మంత్రాలయం: జిల్లా పశ్చిమ ప్రాంతంలో బీడుభూములను సస్యశ్యామలం చేసేందుకు గురురాఘవేంద్ర ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఒక మైనర్‌ ఇరిగేషన్‌, 11 ఎత్తిపోతల పథకాలు ఉండగా మొత్తం 50 వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. దీంతో నీరందక రైతులు పొలాలను బీళ్లుగా పెట్టుకున్నారు. తీవ్ర కరువుతో చాలా మంది చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్న ఊరిని వదిలి జీవనోపాధి నిమిత్తం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లారు. రబీ సీజన్‌ ప్రారంభమైనా రాష్ట్ర ప్రభుత్వం కనీసం గురురాఘవేంద్ర ప్రాజెక్టు మరమ్మతులకు నిధులను కూడా కేటాయించలేదు.

ప్రాజెక్టు లక్ష్యం ఇదీ..

గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కింద మంత్రాలయం నియోజకవర్గంలో మూగలదొడ్డి, దుద్ది, మాధవరం, బసలదొడ్డి ఎత్తిపోతలతోపాటు సూగూరు మైనర్‌ ఇరిగేషన్‌ జలాశయం నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా 2006లో సూగూరు జలాశయం ప్రారంభోత్సవం చేశారు. అదేరోజు రూ.261.19 కోట్లతో పులికనుమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సోగనూరు, పూలచింత, చిలకలడోణ ఎత్తిపోతలు, కోడుమూరు నియోజకవర్గంలో ఏపీఎస్‌ఐడీసీ శాఖ పరిధిలో కృష్ణదొడ్డి, చింతమాన్‌పల్లె, రేమట, మునుగాల లిఫ్టు ఇరిగేషన్‌ పథకాలు నెలకొల్పారు. తుంగభద్ర నది నుంచి 5.373 టీఎంసీల నీటిని జలాశయాలకు ఎత్తిపోసి సాగునీరు అందించి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎమ్మిగనూరులో 4,350 ఎకరాలు, నందవరంలో 8,033 ఎకరాలు, మంత్రాలయంలో 11,034 ఎకరాలు, కోసిగిలో 8,566 ఎకరాలు, పెద్దకడబూరులో 1,420 ఎకరాలు, సి.బెళగల్‌లో 6,825 ఎకరాలు, గూడూరులో 4,365 ఎకరాలు, కర్నూలులో 4,997 ఎకరాల ఆయకట్టు నిర్ధారించారు.

ప్రతిపాదనలకే పరిమితం

ముఠా చోరీల కారణంగా ఆరు ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యమయ్యాయి. పంపుహౌస్‌ల మరమ్మతుల కోసం ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపి ఏడాది కావొస్తున్నా కూటమి ప్రభుత్వం కరుణించడం లేదు. ప్రాజెక్టు అధికారులు మరమ్మతులకు రూ.17 కోట్లు అంచనాతో ప్రతిపాదనలు పంపడం జరిగింది. మొండికేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లిగవ్వ కేటాయించలేదు. కేవలం రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి (ఎస్‌డీఎంఎఫ్‌) కింద రూ.1.28 కోట్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది. పథకం పరిధిలో ఏడు పనులు, జీతాలకు ఈ నిధి సరిపోయింది. మాధవరం, బసలదొడ్డి పథకాల నుంచి సెంటు భూమికి నీరివ్వలేదు. పథకాల పరిధిలో భూములు బీళ్లుగా మారాయి.

మూగలదొడ్డి స్టేజ్‌–1 పంపుహౌస్‌

తుంగభద్ర నదిలో వరద నీరు ఏరులై పారుతోంది. పంపుహౌస్‌ల మరమ్మతులు చేపట్టకపోవడంతో పథకాలన్నీ దిష్టిబొమ్మలుగా మారాయి. నీరు ఎత్తిపోయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా రబీ సీజన్‌లో పంట సాగుకు అవకాశం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదు. ఇటీవల ప్రభుత్వం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువలు, కేసీ కాలువ మైనర్‌ రిపేర్లకు నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. జిల్లా పశ్చిమ ప్రాంత రైతులను పట్టించుకోకపోవడం దారుణం.

–గడ్డం నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు సంఘం జిల్లా అధికార ప్రతినిధి

పంపుహౌస్‌ల్లో జరిగిన చోరీలతో పథకాలు నిరుపయోగంగా మారాయి. కరువు ప్రాంత రైతులకు ఊతంగా ఉన్న ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఇప్పటికే చాలా గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు వలస వెళ్లారు. వలసల నియంత్రణకు జీఆర్పీ ప్రాజెక్టు మరమ్మతులు ఎంతో అవసరం. ఇప్పటికై నా ప్రభుత్వం దిగివచ్చి రబీ పంటలకు సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సి ఉంది.

– రాముడు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి

గురువా.. కనవా! 
1
1/3

గురువా.. కనవా!

గురువా.. కనవా! 
2
2/3

గురువా.. కనవా!

గురువా.. కనవా! 
3
3/3

గురువా.. కనవా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement