● టీడీపీ కౌన్సిలర్ల తీరుపై సర్వత్రా విమర్శలు ● కౌన్సిల్‌ సమావేశంలో ప్రజా సమస్యలు ప్రస్తావించని వైనం ● పార్టీ కార్యాలయ స్థలం కేటాయింపునకు పట్టు ● తీర్మానాన్ని ఆమోదించాలని గగ్గోలు ● వ్యతిరేకించిన మెజార్టీ సభ్యులు | - | Sakshi
Sakshi News home page

● టీడీపీ కౌన్సిలర్ల తీరుపై సర్వత్రా విమర్శలు ● కౌన్సిల్‌ సమావేశంలో ప్రజా సమస్యలు ప్రస్తావించని వైనం ● పార్టీ కార్యాలయ స్థలం కేటాయింపునకు పట్టు ● తీర్మానాన్ని ఆమోదించాలని గగ్గోలు ● వ్యతిరేకించిన మెజార్టీ సభ్యులు

Nov 2 2025 9:26 AM | Updated on Nov 2 2025 9:26 AM

● టీడ

● టీడీపీ కౌన్సిలర్ల తీరుపై సర్వత్రా విమర్శలు ● కౌన్సిల్

● టీడీపీ కౌన్సిలర్ల తీరుపై సర్వత్రా విమర్శలు ● కౌన్సిల్‌ సమావేశంలో ప్రజా సమస్యలు ప్రస్తావించని వైనం ● పార్టీ కార్యాలయ స్థలం కేటాయింపునకు పట్టు ● తీర్మానాన్ని ఆమోదించాలని గగ్గోలు ● వ్యతిరేకించిన మెజార్టీ సభ్యులు

ఆ నలుగురు అంతే!

బొమ్మలసత్రం: ఎంతో నమ్మకంతో ప్రజలు వారిని వార్డు కౌన్సిలర్లుగా గెలిపించుకున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తారని, వార్డు అభివృద్ధికి కృషి చేస్తారని నమ్మి కౌన్సిలర్లుగా ఎన్నుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు వమ్ము చేస్తున్నారు. పార్టీ కోసం ప్రజల సమస్యలను పక్కన పడేస్తున్నారు. వరుసగా మూడు నెలలుగా కౌన్సిల్‌ సమావేశాల్లో ఆ నలుగురు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయా వార్డు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 4, 12, 21, 27 వార్డు కౌన్సిలర్లు టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయింపుకు సంబంధించిన అంశాన్ని ఆమోదించుకోవాలని మూడు నెలలుగా సభలో వ్యవహరిస్తున్న తీరును అందరూ తప్పుబడుతున్నారు. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు అవస్థలు పడుతుంటే వాటిపై చర్చ జరపకుండా పార్టీ కార్యాలయం కోసం వారు చేస్తున్న గందరగోళంతో సభా సమయం వృథా అవుతోంది. శుక్రవారం నంద్యాల మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌హాల్‌లో చైర్‌పర్సన్‌ మాబున్నిసా అధ్యక్షతన కమిషనర్‌ శేషన్న ఆధ్వర్యంలో కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌.. మోంథా తుపాన్‌ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు. అనంతరం అజెండాలోని మొదటి అంశమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి పట్టణం నడిబొడ్డులో ఉన్న 1.57 సెంట్ల భూమి కేటాయింపు ప్రస్తావనను కౌన్సిల్‌ ఆమోదం కోసం ఉంచారు. అధిక సంఖ్యలో కౌన్సిల్‌ సభ్యులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించటంతో చైపర్సన్‌ ఆ అంశాన్ని రద్దు చేశారు. దీంతో 4వ వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్‌ మెహబూబ్‌వలి, 12వ వార్డుకు చెందిన ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ శ్యామ్‌సుందర్‌లాల్‌, 21వ వార్డుకు చెందిన శ్రీదేవి, 27వ వార్డుకు చెందిన జైనాబీలు సభలో గందరగోళం సృష్టించారు. స్థలం కేటాయింపుకు అనుకూలంగా సభ్యులు ఆమోదం తెలపాలని పట్టుబట్టారు. సభలో వారు వైస్‌ చైర్మన్‌ గంగిశెట్టి శ్రీధర్‌, పామ్‌షావలిలపై గట్టిగా కేకలు వేస్తూ బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. మెజార్టీ సభ్యుల అభ్యర్థన మేరకు చైర్‌పర్సన్‌ మాబున్నిసా ఆ అంశాన్ని రద్దు చేయటంతో ఆ నలుగురు కౌన్సిలర్లు బాయ్‌కాట్‌ చేసి వెళ్లిపోయారు.

మూడు నెలలుగా....

కౌన్సిల్‌ సమావేశంలో గత మూడు నెలలుగా టీడీపీ సభ్యుల తీరు ఇలాగే ఉంది. ప్రజా సమస్యలు కౌన్సి ల్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు పట్టణంలో 42 వార్డుల కౌన్సిలర్లు కౌన్సిల్‌ సమావేశానికి హాజరవుతారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ నలుగరు సభ్యుల్లో ప్రజా సమస్యలు చర్చించా లన్న తపన లేకపోగా ప్రజలకు అవసరం లేని తమ పార్టీ కార్యాలయ స్థల కేటాయింపు కోసం వారు పడేపాట్లు చూస్తే ముక్కున వేలేసుకుంటున్నారు. తమ వార్డుల్లో అభివృద్ధి మొత్తం జరిగిపోయినట్లు .. ఇక తమ వార్డు ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవన్నట్లు.. కేవలం ఒకే అంశాన్ని సభలో చర్చకు పట్టుబడటం చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు.

మంత్రి శంకుస్థాపన చేసినా

ప్రయోజనం లేదు..

ఈ సందర్భంగా కౌన్సిలర్‌ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. తమ వార్డులో సాక్షాత్తు మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినా ప్రయోజనం లేదన్నారు. అభివృద్ధి పనులకు తమ వద్ద నిధులు లేవని నేరుగా కమిషనర్‌ చెప్పడం భావ్యం కాదన్నారు. అనివృద్ధి పనులు చేయలేనప్పుడూ పన్నులు చెల్లించవద్దని వార్డు ప్రజలకు చెబుతామన్నారు. మంత్రి వచ్చి అభివృద్ధి పనులు ప్రారంభం చేసినప్పటికీ తమ వద్ద నిధులు లేవని చెప్పడం సరైందికాదన్నారు. అలాంటప్పు డూ వార్డుల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నామంటూ ఆడంబరాలు చెప్పుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

అభివృద్ధికి నిధుల్లేవ్‌..

పట్టణంలోని 42 వార్డుల్లో రహదారులు, డ్రైనేజీలు తదితర అంశాలకు సంబంధించి కౌన్సిలర్లు ప్రస్తావనకు తేగా తమ వద్ద కౌన్సిలర్లు అడిగిన ప్రతి పనికి అంత నిధులు లేవని కమిషనర్‌ శేషన్న సమాధానమిచ్చారు. మున్సిపాల్టీ ద్వారా అమృత్‌ ఈఎంఐ చెల్లింపునకు రూ.74.53 లక్షలు కాగా తక్కిన వాటి ఖర్చులు పోను అంతంత మాత్రమే నిధులు ఉన్నాయని రూ.కోట్లు ఖర్చు చేసి కౌన్సిలర్లు అడిగిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేమని సభలో తేల్చి చెప్పారు. సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఎక్కడ వేయాలో తాము వెమళ్లీ ప్రత్యక్షంగా చూసి ఆ పనులను మాత్రమే చేస్తానని కమిషనర్‌ వెల్లడించారు.

● టీడీపీ కౌన్సిలర్ల తీరుపై సర్వత్రా విమర్శలు ● కౌన్సిల్1
1/1

● టీడీపీ కౌన్సిలర్ల తీరుపై సర్వత్రా విమర్శలు ● కౌన్సిల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement