
వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
కర్నూలు (టౌన్): పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులను నియమించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం రాష్ట్ర కార్యదర్శులుగా తెర్నేకల్ సురేందర్ రెడ్డి, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డిని, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి కర్రా హర్షవర్దన్ రెడ్డిని నియమించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిఽధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను వీరికి కేటాయించారు. పా ర్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారులుగా వీరు వ్యవహరించనున్నారు.
జిల్లాలో అరకొర వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వర్షాలు అరకొర మాత్రమే పడుతున్నాయి. దీంతో ఖరీఫ్ సాగులో పురోగతి తగ్గింది. గత రెండు రోజుల్లో జిల్లా మొత్తంగా కేవలం 11.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 12 మండలాల్లో స్వల్ప స్థాయిలో వర్షాలు కురిశాయి. ఖరీఫ్ సాధారణ సాగు 3.59 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 2,15,063 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 2,32,855 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వర్షాలు నిరాశజనకంగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
33 మంది ఎస్‌ఐలకు త్వరలో పదోన్నతి
కర్నూలు: పోలీసు శాఖ ఫోర్త్ జోన్ (రాయలసీమ జోన్) పరిధిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 33 మంది ఎస్‌ఐలకు సీఐలుగా పదోన్నతి కల్పించేందుకు ప్యానెల్ జాబితా సిద్ధమైంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల్లోని శాంతి భద్రతల (లా అండ్ ఆర్డర్ స్టేషన్లు) విభాగంతో పాటు సీఐడీ, రైల్వే, ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ తదితర లూప్‌లైన్ విభాగాల్లో పనిచేస్తున్న 33 మంది ఎస్‌ఐలు ప్రభుత్వ అనుమతితో సీఐలుగా పదోన్నతి పొందనున్నారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8 మంది, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 6గురు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 9 మంది, వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు ఎస్‌ఐలు పదోన్నతి జాబితాలో ఉన్నారు. లూప్‌లైన్ విభాగాల్లో పనిచేస్తున్న మరో 8 మంది ఎస్‌ఐలు కూడా పదోన్నతి జాబితాలో ఉన్నారు. ఈ మేరకు జాబితా విడుదలైంది.
మహానందీశ్వరుడికి రూ. 48.61 లక్షల ఆదాయం
మహానంది: మహానంది క్షేత్రానికి హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 48,61,653 ఆదాయం లభించినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానందిలోని అభిషేక మండపంలో శనివారం ఉభయ ఆలయాల హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 48,04,588 ఆదాయం వచ్చిందన్నారు. అన్నప్రసాదం, గో సంరక్షణ విభాగాల ద్వారా రూ. 57,065 వచ్చిందని, 50 రోజులకు మొత్తం రూ. 48.61 లక్షలు లభించిందన్నారు. నగదు కానుకలతో పాటు 9 గ్రాముల 90 మిల్లీ గ్రాముల బంగారు, 470 గ్రాముల వెండి భక్తులు సమర్పించారన్నారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ పి.సుబ్బారెడ్డి, ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
శిఖరేశ్వరం
అభివృద్ధికి చర్యలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్ర పరిధిలోని శిఖరేశ్వరం వద్ద పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన శిఖరేశ్వరం ఆలయాన్ని పరిశీలించారు. కోనేరు, ఆలయం చుట్టూ క్షేత్ర విశిష్టతలను తెలిపే బొమ్మలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కర్రా
హర్షవర్ధన్ రెడ్డి
ఎర్రకోట
జగన్మోహన్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం