
టీడీపీ నేతలను నిలదీయండి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయిందని, ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయలేదని, ఉచిత బస్సు హామీ ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. టీడీపీ నేతలను అడుగడుగునా నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కల్లూరు అర్బన్ 37వ వార్డులో ‘బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ, ఇంటింటికీ వంచన’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. –కల్లూరు