
చంద్రబాబు కుట్రలను బలంగా ఎదుర్కొంటాం
కర్నూలు (టౌన్): టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలను బలంగా ఎదుర్కొంటామని, ఎన్ని కుట్రలు, కుతాంత్రాలు చేసినా మరింత బలపడతామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి అన్యానరు. ఎస్వీ కాంప్లెక్స్‌లోని తన చాంబర్‌లో శనివారం సాయంత్రం ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేశారన్నారు. లిక్కర్ కేసుతో కక్షలు తారస్థాయికి చేరాయన్నారు. లిక్కర్ వ్యవహారంలో ముందుగా రూ.50 వేల కోట్లు, మరోసారి రూ.30 వేల కోట్లు, ఆ తరువాత రూ.18 వేల కోట్లు, ఇప్పుడు రూ.2 వేల కోట్లు అంటూ కట్టుకథ అల్లారని తెలిపారు. కొందరు ఉద్యోగులను బెదిరించి, భయపెట్టి వారి మాటాలను వాంగ్మూలంగా చూపించి కుట్ర కేసును నడిపిస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులను వేధించడం కోసమే అరెస్టులు చేస్తున్నారన్నారు. లిక్కర్ కేసు దర్యాప్తు సంస్థలు, కోర్టులు చేస్తున్న ట్రయల్ కాదని, ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు కక్షతో చేస్తున్న రాజకీయ ట్రయల్ అని విమర్శించారు. ఇలాంటి కుట్రలు చేయడం, కక్షసాధింపు చర్యలకు పాల్పడటం చంద్రబాబుకు అలవాటే అన్నారు. ఏడు కేసుల్లో బెయిల్‌పై ఉన్న చంద్రబాబు నాయుడు తనమీద ఉన్న కేసులన్నింటినీ నిర్వీర్యం చేసి మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మీద రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు రేట్లు అమ్ముతున్నారని, సిండికేట్ అయ్యారని, టెండర్ల తరువాత కమిషన్లు పెంచారని విమర్శించారు. చంద్రబాబు దుర్మార్గాలను ఎండగట్టడంలో వెనకడుగు ప్రసక్తే లేదన్నారు.
జగన్ అనుయాయులను
వేధించేందుకే లిక్కర్ కేసు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి