పోటీతత్వంతో కరాటేలో రాణించాలి | Sakshi
Sakshi News home page

పోటీతత్వంతో కరాటేలో రాణించాలి

Published Mon, Dec 4 2023 1:48 AM

పోటీలకు హాజరైన క్రీడాకారులు - Sakshi

కర్నూలు (టౌన్‌) : మార్షల్‌ ఆర్ట్స్‌లో పోటీతత్వంతో రాణించాలని కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య అన్నారు. ఆదివారం స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని దేవి ఫంక్షన్‌ హాలులో దక్షిణాధి రాష్ట్రాల కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మేయర్‌ ప్రారంభించి మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించడం, క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు ఆడుదాం– ఆంధ్ర పేరుతో ప్రభుత్వం మెగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, పోటీల నిర్వహణ కార్యదర్శి ఫయాజ్‌ అహ్మద్‌, ఆదర్శ విద్యా సంస్థల అధిపతి డాక్టర్‌ హరికిషన్‌, పోటీల నిర్వాహకులు జగదీష్‌, గౌస్‌, ఆరిఫ్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

కరాటే చాంపియన్‌షిప్‌ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న మేయర్‌ బీవై రామయ్య
1/1

కరాటే చాంపియన్‌షిప్‌ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న మేయర్‌ బీవై రామయ్య

Advertisement
Advertisement