సకాలంలో స్పందించి పరిష్కరించండి
కలెక్టర్ డీకే బాలాజీ మీ కోసంలో 201 అర్జీలు స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీలపై అధికారులు సకాలంలో స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్ సమావేశం హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీవో స్వాతి, ఏఎస్పీ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 284 అర్జీలను సంబంధిత అధికారులు చూడకపోవడం సరి కాదన్నారు. 128 అర్జీలు గడువుదాటి ఉన్నాయని వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందర్ని ఎస్‌బీఐలో జీతాల ఖాతాలను తెరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది న్యూఇయర్ వేడుకలకు పుష్పగుచ్చాలు, శాలువాలు తీసుకురాకుండా జిల్లాలోని ప్రభుత్వ బాలికల వసతిగృహాల్లోని వారికి శానిటరీ కిట్లు, చాపలు, టేబుల్స్ వంటివి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ –2025 పోటీల్లో మచిలీపట్నంకు చెందిన బీరం ప్రశాంత్ 65 కిలోల విభాగంలో మొదటి స్థానంలో నిలిచినందుకు కలెక్టర్ సన్మానించారు. మీ కోసంలో 201 అర్జీలను అధికారులు స్వీకరించారు.
అర్జీల్లో కొన్ని..


