ఊరు మనదే... వేసెయ్‌ పాగా! | - | Sakshi
Sakshi News home page

ఊరు మనదే... వేసెయ్‌ పాగా!

Dec 2 2025 9:46 AM | Updated on Dec 2 2025 9:46 AM

ఊరు మ

ఊరు మనదే... వేసెయ్‌ పాగా!

చర్యలు తీసుకుంటాం

జగ్గయ్యపేట: బ్రిటీష్‌ వారి పాలనలో లోకల్‌ ఫండ్‌ కింద రోడ్డు నిర్మాణాలకు స్థలాలను కేటాయించేవారు. ఆ క్రమంలోనే పుట్టబజారు పక్కనున్న సర్వే నంబరు 164/2లో 70 సెంట్ల భూమిని కేటాయించారు. కాలక్రమేణా ఈ భూమి జిల్లా పరిషత్‌కు సంక్రమించింది. ఈ భూమి జాతీయ రహదారి సమీపంలో ఉండటంతో పాటు ఆ ప్రాంతంలో విలాసవంతమైన భవనాలు, అపార్ట్‌మెంట్‌లు, ఫుడ్‌ కోర్టులు, విద్యా సంస్థలు నెలకొనడంతో ఈ స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ స్థలాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. సెంటు స్థలం ధర రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల వరకు పలుకుతోంది. దీంతో జెడ్పీ స్థలాన్ని స్వాహా చేసేందుకు కబ్జాదారులు యత్నిస్తున్నారు.

ఇప్పటికే పలు కట్టడాల నిర్మాణం

జిల్లా పరిషత్‌కు చెందిన ఈ 70 సెంట్ల స్థలంలో ఇప్పటికే వాటర్‌ ప్లాంట్‌, బడ్డీ కొట్లు వెలిశాయి. ఇటీవల రాత్రికి రాత్రే ఓ దేవాలయాన్ని నిర్మించడంతో పాటు చుట్టూ ఇనుప ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో ఏదో ఒక చోట చిన్న పాక ఏర్పాటు చేస్తే స్థలం సొంతమవుతుందని కొందరు అక్రమార్కులు ఆ దిశగా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతుండటం గమనార్హం.

హెచ్చరిక బోర్డులున్నా లెక్కలేదు..

ఈ స్థలం జెడ్పీకి చెందినదని, ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను సైతం కబ్జాదారులు లెక్కచేయడం లేదు. గత నెల 24న జిల్లా పరిషత్‌ అధికారి వచ్చి స్థలాన్ని రెవెన్యూ, సర్వే అధికారులతో పరిశీలించి బోర్డులు ఏర్పాటుచేశారు. అయినా కబ్జాదారులు వాటిని ఏమాత్రం ఖాతరుచేయకపోవడం గమనార్హం. ఆక్రమణలను స్థానిక అధికారులు పరిశీలించి కూడా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికార పార్టీ నేతల అండదండలు

స్థలం కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. అక్రమార్కులకు అధికార పార్టీ నాయకుల అండదండలుండటంతో అధికారులు చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ 70 సెంట్ల స్థలం ప్రస్తుతం మార్కెట్‌ విలువ సుమారు రూ.22 కోట్ల వరకు ఉంటుంది. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని, అధికారులు ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. పట్టించుకోవాల్సిన పాలకులు, అధికారులు మిన్నకుంటున్నారు. దీంతో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇందుకు నిదర్శనం జగ్గయ్యపేటలోని జిల్లా పరిషత్‌కు చెందిన స్థలం. కోట్లాది రూపాయల విలువైన పట్టణంలోని కోదాడ పుట్టబజారు వద్ద నున్న జిల్లా పరిషత్‌ స్థలం కబ్జాకు గురైన సంబంధిత అధికారులకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం శోచనీయం.

జెడ్పీ భూమిపై అక్రమార్కుల కన్ను

70 సెంట్ల భూమి కబ్జాకు యత్నం

స్థలంలో పలు కట్టడాల నిర్మాణం

రాత్రికి రాత్రే వెలసిన ఆలయం

మార్కెట్‌ ధర రూ.22 కోట్లు

నిద్ర నటిస్తున్న అధికారులు

జిల్లా పరిషత్‌ స్థలాన్ని ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. జిల్లా పరిషత్‌ స్థలంలోని ఆక్రమణలను తొలగించి కబ్జా కోరల నుంచి కాపాడుతాం.

–ఆర్‌సీ ఆనంద్‌కుమార్‌,

జిల్లా పరిషత్‌ డెప్యూటీ సీఈవో

ఊరు మనదే... వేసెయ్‌ పాగా! 1
1/1

ఊరు మనదే... వేసెయ్‌ పాగా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement