
విజృంభిస్తున్న విష జ్వరాలు
పెడన: మండలంలోని పలు గ్రామాలు, పెడన పట్టణంలో విషజ్వరాలు విజృంభించాయి. పెడన పీహెచ్‌సీలో మంగళవారం ఓపీ వందకు పైగా ఉంది. ఓపీకి జ్వరపీడితులే అధికం వచ్చారు. రోగులకు సైలెన్ పెట్టడానికి బెడ్లు ఖాళీ కరువైంది. దీంతో ఆవరణలో కొత్తగా వచ్చిన బెడ్లపై రోగులకు సైలెన్లు పెట్టారు. ఒకరికి ఒక బాటిల్ పెట్టి రేపు రావాలని వైద్యాధికారులు సూచించడంతో మరొకరిని ఆ బెడ్‌పై పడుకోబెట్టి సైలెన్ పెడుతున్నారు. వైద్యాధికారిణి మీనాదేవి మాట్లాడుతూ పట్టణంతో పాటు మండలంలోని పలు చోట్ల నుంచి వైరల్ ఫీవర్స్‌తో వస్తున్నారని, వారిని పరీక్షించి మందులు ఇస్తున్నామని తెలిపారు. కొందరికి సైలెన్ బాటిళ్లు పెట్టినట్లు పేర్కొన్నారు.