
పెన్షన్ ఫైల్స్‌లో చేతివాటం తగదు : యూటీఎఫ్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ ఫైల్స్ పరిష్కారంలో డీటీవో కార్యాలయ సిబ్బంది చేతివాటాన్ని నివారించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా డీటీవో కార్యాలయంలో అధికారులను కలసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షన్ ఫైల్స్ ఏజీ నుంచి వచ్చినవి వెంటనే పరిశీలన చేసి ట్రెజరీలకు పంపడంలో డీటీవో కార్యాలయం సిబ్బంది తీవ్రజాప్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో రిటైౖర్ అయిన పలువురు ఉపాధ్యాయుల ఫైల్స్ ఫిబ్రవరిలో వచ్చినప్పటికీ జూలై నెలలో కూడా ఆమోదిత ఉత్తర్వులు మంజూరు చేయలేదన్నారు. పెన్షన్ ప్రతిపాదనలు తీవ్ర జాప్యంతోపాటు రిటైర్డ్ అయిన వారికి కనీస సమాచారం సైతం ఇవ్వడం లేదనిన్నారు. దీంతో ఆఫైళ్లు నెలల తరబడి వారి వద్ద పెండింగ్‌లో ఉంచుతున్నారన్నారు. ముడుపులు ముట్టచెబితేనే పనులు వేగంగా సాగుతున్నాయని ఆరోపించారు. ఇకనైనా ఈ పరిస్థితి మారాలని వారు కోరారు. డీటీవో కార్యాలయంలో వినతిపత్రం అందించిన వారిలో యూటీఎఫ్ నాయకులు కె.సంజీవరెడ్డి, పి.రామారావు, జె.కృష్ణ తదితరులు ఉన్నారు.