
పంటలు పండటం లేదు
రొయ్యలు చెరువులు లేనప్పుడు మా పొలంలో దిగబడులు బాగా వచ్చేవి. రెండోపంట మినుము కూడా పండేది. రొయ్యల చెరువుల కారణంగా కొన్నేళ్లుగా పంటలసాగు ఖర్చులు కూడా రాకపోతుండటంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నాం.
–బండి రాజేంద్ర, రైతు. ఘంటసాల
పొలం కొని నష్టపోయా
రొయ్యల చెరువుల ఉప్పునీటి కారణంగా మేము కొనుక్కున్న పొలం పాడైపోయింది. కనీసం కౌలుకు ఇద్దామనుకున్నా రైతులు ముందుకు రావడం లేదు. ఈసమస్యను పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవడం లేదు.
–వడ్లమూడి కోటయ్య, రైతు, తాడేపల్లి

పంటలు పండటం లేదు