
విజయవాడలో మద్యం, గంజాయి మత్తులో హత్యలు
గ్యాంగ్ వార్.. జూన్ 8న పట్టపగలు రద్దీగా ఉండే రోడ్డుపై క్రీస్తురాజుపురం ఆల్ఫా టీ సెంటర్ సమీపంలో కొందరు యువకులు, రౌడీ షీటర్లు మద్యం మత్తులో బీరు సీసాలు, కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలోనే ఈ ఘటన జరిగింది.
పాత నేరస్తుడి హత్యాకాండ.. విజయవాడ గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో తనతో కలిసి అద్దెకు ఉంటున్న ఎం.రాజు, గాదె వెంకట్ అనే ఇద్దరు యువకులను జమ్ము కిశోర్ అనే రౌడీ షీటర్ మద్యం మత్తులో బుధవారం మధ్యాహ్న సమయంలో కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిపై ఇప్పటికే ఎనిమిది కేసులు కూడా ఉన్నాయి.
శ్మశానంలో హత్య.. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నెలల కిందట రామవరప్పాడు శ్మశానంలో మద్యం మత్తులో ఉన్న వైకుంఠం, చికెన్‌సాయి అనే వ్యక్తుల మధ్య వివాదం చెలరేగగా, చికెన్‌సాయి కోడిని కోసే కత్తితో వైకుంఠం ఛాతిపై బలంగా పొడవడంతో తీవ్రగాయాలై మృతి చెందాడు.
ఒంటరిగా వెళ్లడమే పాపం.. విజయవాడ రైల్వే యార్డులో గతేడాది అక్టోబర్ 10వ తేదీన విధులలో ఉన్న లోకోపైలెట్ డి. ఎబినేజర్ అనే వ్యక్తిని తెల్లవారుజామున 2గంటల సమయంలో గంజాయి మత్తులో ఉన్న దేవ్‌కుమార్ అనే యువకుడు డబ్బులు డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వనందుకు ఇనుపరాడ్లతో ఎబినేజర్‌పై దాడి చేయడంతో మృతి చెందాడు.
మాటామాటా పెరిగి.. మే నెలలో మాచవరం పోలీసు స్టేషన్ పక్క రోడ్డులో మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో రాంబాబు అనే వ్యక్తిని మరొకరు బండరాయితో తలపై కొట్టి చంపేశాడు. ఇది పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరిగింది.
జంట హత్యలు.. వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు సుమారు అరకిలోమీటర్ దూరంలో ఉన్న గద్దబొమ్మ సెంటర్‌కు సమీపంలో రెండు హత్యలు జరిగాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంల్లో హత్యలు జరగటం కలవరపాటుకు గురి చేసింది.
బ్లేడ్ బ్యాచ్ దారుణం.. గతేడాది అక్టోబర్ ఎనిమిదో తేదీ తెల్లవారుజామున కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్‌కు సమీపంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యాపారి శ్యామ్‌గుప్తాను బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన వ్యక్తులు గొంతు కోసి పరారయ్యారు. అతనిని పోలీసులు ఆస్పత్రికి తరలించేలోపు మరణించాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే వెలుగుచూసిన ఘటనలే కోకొల్లలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జరిగాయి. విచ్చల విడిగా మద్యం, గంజాయి సులువుగా లభ్యమవుతుండటంతో మత్తోన్మాదులు పెచ్చుమీరుతున్నారు. నగరంలో అర్ధరాత్రి ఒంటరిగా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.
ఇవిగో సాక్ష్యాలు..

విజయవాడలో మద్యం, గంజాయి మత్తులో హత్యలు