గజదొంగలు! | - | Sakshi
Sakshi News home page

గజదొంగలు!

Jul 10 2025 8:16 AM | Updated on Jul 10 2025 8:16 AM

గజదొం

గజదొంగలు!

కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025
బెజవాడలో

3

విజయవాడ నగరం ఏరియల్‌ వ్యూ

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌కు పురస్కారం

భవానీపురం(విజయవాడపశ్చిమ): రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్న ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశకు పురస్కారం లభించింది. రెడ్‌క్రాస్‌ సంస్థకు నిధుల సమీకరణ, సభ్యత్వ నమోదులో విశేష ప్రతిభ కనబరచటమే కాకుండా సామాజిక సేవలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వార్షిక సమావేశంలో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ నుంచి కలెక్టర్‌ లక్ష్మీశ ఈ అవార్డ్‌ అందుకున్నారు. లక్ష్మీశను గవర్నర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రెడ్‌క్రాస్‌ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి, సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. గవర్నర్‌ నుంచి అవార్డ్‌ స్వీకరించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి ఎకే ఫరీదా, చైర్మన్‌ వై.డి.రామారావు, వైస్‌ చైర్మన్‌ పి.జగన్‌మోహన్‌రావు, కోశాధికారి పి.రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం

ఘంటసాల: వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైందని అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.సత్యప్రియ లలిత తెలిపారు. బుధవారం కళాశాలలో ఆమె మాట్లాడుతూ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సుకు దరఖాస్తు చేసుకున్న వారు 12వ తేదీ వరకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వెబ్‌సెట్‌(angrau.ac.in)లో వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవాలని సూచించారు.

గోదావరి జలాలకు హారతి

ఇబ్రహీంపట్నం: ఫెర్రీలోని పవిత్రసంగమం వద్ద పట్టిసీమ కాలువ ద్వారా కృష్ణానదిలో కలుస్తున్న గోదావరి జలాలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ బుధవారం జలహారతి ఇచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పసుపు, కుంకుమ, చీరతో కూడిన సారె సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు పట్టిసీమ ప్రాజెక్ట్‌ ద్వారా 428 టీఎంసీలకు పైగా నీరు కృష్ణా డెల్టాకు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్‌ రాజగోపాల్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, మునిసిపల్‌ చైర్మన్‌ చెన్నుబోయిన చిట్టిబాబు, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ రమ్యకీర్తన తదితరులు పాల్గొన్నారు.

నవోదయ విద్యాలయానికి స్థల పరిశీలన

తిరువూరు: తిరువూరులో ఏర్పాటు కానున్న జవహర్‌ నవోదయ విద్యాలయం భవన నిర్మాణాలకు అనువైన స్థలాలను ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియా బుధవారం పరిశీలించారు. తిరువూరు శివారు పీటీ కొత్తూరులోని పోస్టుబేసిక్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న స్థలంలో త్వరలో జవహర్‌ నవోదయ విద్యాలయం ఏర్పాటవుతుందని జేసీ చెప్పారు. పీటీ కొత్తూరులో తిరువూరు పట్టణానికి చెందిన పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ కోసం స్థల పరిశీలన చేశారు. ఆర్డీఓ కార్యాలయం, ఏసీపీ, డీఎల్‌డీఓ కార్యాలయాలకు కూడా స్థలాలు కేటాయించనున్నామని జేసీ తెలిపారు. తొలుత ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇబ్రహీంపట్నం–జగదల్‌పూర్‌ జాతీయ రహదారిని జేసీ పరిశీలించారు. త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణ పనులను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ పూర్తి చేస్తుందని వెల్లడించారు. గంపలగూడెం మండలం తునికిపాడు వద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూములను పరిశీలించారు. తిరువూరు ఆర్డీవో కె. మాధురి, తహసీల్దార్లు పాల్గొన్నారు.

ముగిసిన ‘ఈసెట్‌’

సర్టిఫికెట్ల పరిశీలన

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో జరుగుతున్న ఈసెట్‌–2025 పరీక్షలో ప్రత్యేక కేటగిరీకి చెందిన ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసింది. మంగళవారం 376మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. బుధవారం–191మంది సర్టిఫికెట్లను పరిశీలించామని వారిలో క్యాప్‌–5, ఎన్‌సీసీ–81, విభిన్న ప్రతిభావంతులు–32, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌–59, స్కౌట్స్‌ అండ్‌ గౌడ్స్‌–14మంది ప్రత్యేక కేటగిరీకి చెందిన ర్యాంకర్ల సర్టిఫికెట్లను పరిశీలించామని హెల్ప్‌లైన్‌ సెంటర్‌ కో–ఆర్టినేటర్‌ ఎం.విజయసారథి చెప్పారు. జనరల్‌ కేటగిరీకి చెందిన ర్యాంకర్ల సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పరిశీలించామన్నారు.

సుబ్బారాయుడికి

రూ. 1.11కోట్ల ఆదాయం

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 1,11,75,901 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. బుధ వారం ఆయన మాట్లాడుతూ దేవదాయ ధర్మ దాయశాఖ కృష్ణాజిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎన్‌వీ సాంబశివరావు, ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఉదయం హుండీలను తెరచి లెక్కించినట్లు తెలిపారు. 104 రోజులకు గాను నగదు రూపంలో రూ.1,11,75,901, బంగారం 41.02గ్రాములు, వెండి 2.550 కిలోలు, అమెరికన్‌ డాలర్లు 159 వచ్చినట్లు వివరించారు. చల్లపల్లి ఎస్టేట్‌ దేవాలయాల అధికారులు, సేవా సమితి సభ్యులు, బ్యాంకు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

రెండు నెలల వ్యవధిలో రూ. 800కోట్లు దోపిడీ

సాక్షి ప్రతినిధి, విజయవాడ: యానిమేషన్‌, గోల్డ్‌, అద్విక ట్రేడింగ్‌.. స్కామ్‌ ఏదైనా బెజవాడ కేంద్రంగానే వెలుగు చూస్తున్నాయి. ప్రజలను మాయ చేసి రెండు నెలల్లోనే కోట్ల రూపాయలు దోచేశారు. జనాల అత్యాశే పెట్టుబడిగా నేరగాళ్లు వల విసురుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే దురాశే.. అసలుకు ఎసరు తెస్తోంది. భారీగా డబ్బులు కలెక్ట్‌ చేశాక బోర్డులు తిప్పేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు మోస పోయామని తెలుసుకున్నాక జనాలు లబోదిబో అంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకపోవడంతో విలవిల్లాడిపోతున్నారు. స్కామ్‌లు జరిగినప్పుడు పోలీసులు హడావుడి చేయడం తప్ప, నిందితుల నుంచి సొమ్ము రికవరీ చేసి, బాధితులకు అండగా నిలిచిన దాఖలాలు లేవని భోరుమంటున్నారు.

అద్విక ట్రేడింగ్‌ మోసంతో..

రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.6వేల వడ్డీ అంటూ తెరపైకి వచ్చారు.. కొన్ని రోజులు పాటు వడ్డీ చెల్లించి జనాల్లో నమ్మకం కల్పించారు. తమకు పరిచయం ఉన్న వారు, స్నేహితులు, ఏజెంట్లను రంగంలోకి దింపి రూ. లక్షకు రూ.6వేల వడ్డీ ఎక్కడ వస్తుందని నమ్మబలికారు. కొంత మంది తన వద్ద డబ్బులు లేకున్నా, వడ్డీ కోసం కక్కుర్తి పడి అప్పుగా తెచ్చి పెట్టుబడి పెట్టి నిండా మునిగారు. అలాగే బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చుకోవచ్చని విసిరిన వలలో పెద్ద చేపలు చిక్కి విలవిల్లాడుతున్నాయి. అద్విక ట్రేడింగ్‌ కంపెనీ బోర్డు తిప్పేసిన వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నల్లధనం భారీగా ఉండి పెట్టుబడులు పెట్టగలవారినే లక్ష్యంగా చేసు కొని వల విసిరారు. దీంతో అద్విక ట్రేడింగ్‌ కంపెనీ నిర్వాహకులు తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తం డబ్బు లు సేకరించి బోర్డు తిప్పేశారు. ఏజెంట్లు డిపాజిటర్ల నుంచి రూ.382 కోట్లు సేకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వచ్చారు. ఇందులో వడ్డీ రూపంలో కొంత మొత్తం చెల్లించినట్లు గుర్తించారు. 1150 మందికి పైగా డిపాజిటర్లు అద్విక ట్రేడింగ్‌ కంపెనీతో 1,700కు పైగా ఎంవోయూలు కుదుర్చుకున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు..

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న బాధితుల సంఖ్య రోజు, రోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం పోలీసులు ప్రధానంగా డిపాజిట్ల రూపంలో సేకరించిన సొమ్ము దారి మళ్లించి, ఆస్తులు కొన్నారా అనే దానిపైన దృష్టించారు. ప్రధానంగా వారి బ్యాంకు అకౌంట్లను సీజ్‌ చేసి, లావాదేవీలను పోలీసులు క్షుణంగా పరిశీలిస్తున్నారు. వారి బ్యాంకు అకౌంట్లను సీజ్‌ చేసి తాజాగా కంపెనీ ఖాతాలు, నగదు లావాదేవీలు అందించాలని పోలీసులు.. బ్యాంకులకు లేఖ రాసి, లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. నిర్వాహకులు విలాసాలకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినట్లు గుర్తించారు. పెట్టుబడి దారులను తప్పు దోవ పట్టించేందుకు గోల్డెన్‌ లీఫ్‌ కంపెనీ తెరపైకి తెచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రెట్టింపు లాభాల పేరిట..

ఈ వైట్‌ కాలర్‌ మోసాలకు అన్నింటికీ జనాల అత్యాశే పెట్టుబడిగా మారినట్లు ఈ సంఘటనలు బట్టి స్పష్టం అవుతోంది. ఇలా అత్యాశకు పోయి డబ్బులు పెట్టుబడులు పెట్టి మోస పోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నా, విజయవాడ కేంద్రంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

సారెతో అమ్మవారి సన్నిధికి వచ్చిన భక్తబృందం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన బుధవారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని శాకంబరిగా దర్శించుకున్నారు. మరో వైపున ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతుండగా.. బుధవారం ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి పలు భక్త బృందాలుగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. సుమారు 50కిపైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. శాకంబరీ ఉత్సవాలకు గోదా వరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైతుల నుంచి సుమారు 25 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను సేకరించినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.

కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి

శాకంబరిగా దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. కనకదుర్గనగర్‌, మహామండపం మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కదంబ ప్రసాదం పంపిణీ చేసింది. ఆలయ ప్రాంగణంలో చేసిన అలంకారం నుంచి ఒక్క కూరగాయ, ఆకుకూరనైనా ఇంటికి తీసుకువెళ్లాలనే భావనతో భక్తులు కూరగాయల కోసం ఎగబడటం కనిపించింది.

న్యూస్‌రీల్‌

జనాల అత్యాశే ఆయుధంగా నేరగాళ్ల వల రెట్టింపు లాభాల పేరిట లూటీ నగరంలో వెలుగుచూసిన యానిమేషన్‌, గోల్డ్‌, అద్విక ట్రేడింగ్‌.. ఈ తరహా మోసాలే స్కామ్‌లు బయటపడిన సమయంలోనే పోలీసుల హడావుడి ఆ తరువాత కేసులు కోల్డ్‌ స్టోరేజిలోకి.. బాధితులకు జరగని న్యాయం

రెండో రోజూ పోటెత్తిన భక్తజనం హరితమయంగా ఇంద్రకీలాద్రి నేడు పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం

నేడు డ్రై ఫ్రూట్స్‌తో..

శాకంబరి ఉత్సవాలు రెండో రోజున అమ్మవారిని దుంప కూరలు, కాయగూరలతో అలంకరించారు. ఆలయం లోపల ధాన్యం కంకులతో చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. చివరి రోజైన గురువారం అమ్మవారిని పండ్లు, ఫలాలు, డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించనున్నారు. ఇందు కోసం యాలకులు, జీడిపప్పులతో దండలను సిద్ధం చేస్తున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని, రాత్రి వరకు అలంకరణ కొనసాగుతుందని అర్చకులు పేర్కొన్నారు.

గజదొంగలు!1
1/15

గజదొంగలు!

గజదొంగలు!2
2/15

గజదొంగలు!

గజదొంగలు!3
3/15

గజదొంగలు!

గజదొంగలు!4
4/15

గజదొంగలు!

గజదొంగలు!5
5/15

గజదొంగలు!

గజదొంగలు!6
6/15

గజదొంగలు!

గజదొంగలు!7
7/15

గజదొంగలు!

గజదొంగలు!8
8/15

గజదొంగలు!

గజదొంగలు!9
9/15

గజదొంగలు!

గజదొంగలు!10
10/15

గజదొంగలు!

గజదొంగలు!11
11/15

గజదొంగలు!

గజదొంగలు!12
12/15

గజదొంగలు!

గజదొంగలు!13
13/15

గజదొంగలు!

గజదొంగలు!14
14/15

గజదొంగలు!

గజదొంగలు!15
15/15

గజదొంగలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement