తిర్యాణి: అడవులను సంరక్షించాల్సిన బాధ్య త పౌరులందరిపై ఉందని జిల్లా అటవీశాఖ అధికారి బాలామణి అన్నారు. వంట చెరుకు వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో మండలంలోని చెలిమల(కొలంగూడ)లో 20 మంది నిరుపేదలకు శుక్రవారం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ ఆదివాసీలు చిన్న చిన్న అవసరాల కోసం చెట్లు నరకవద్దని సూచించారు. అడవులను విస్తృతంగా పెంపొందించి పర్యావరణ సమతూల్యత కాపాడేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. వన్యప్రాణుల వేట, కలప అక్రమ రవాణా చేసేవారిపై కఠిన వ్యవహరిస్తామన్నారు. ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ అధికారులు మనోహర్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


