పంచాయతీల్లో ద్విముఖ పోరు
కెరమెరి(ఆసిఫాబాద్): పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంతో ప్రచారం ముమ్మరం చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 114 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 11న మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఉదయం, సాయంత్రం అనే తేడాలేకుండా గ్రామాల బాట పడుతున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని కెరమెరిలో 31, లింగాపూర్‌లో 14, సిర్పూర్(యు) లో 15, జైనూర్‌లో 26, వాంకిడిలో 28 గ్రామ పంచాయతీలకు గురువారం ఎన్నికలు జరుగనున్నాయి.
రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ!
ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఐదు గ్రామ పంచాయతీల్లో ఈనెల 11న జరుగనున్న మొదటి విడ త గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ జరుగనుంది. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రచారపర్వం ప్రారంభమైంది. ఆ శావహులు ఎవరికి వారు ప్రచారం నిర్వహిస్తున్నా రు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల గుర్తులు లేకపోయినా ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థును గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలయ్యాయి. అభ్యర్థులకు కేటాయించిన గుర్తులతో గ్రామాల్లోకి పరుగులు పెడుతున్నారు. కనిపించిన ప్రతీఒక్కరికి గుర్తులు చూపిస్తూ తమకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థులు, నాయకులు, అనుయాయులు ప్రచారం చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచార పోరు ముమ్మరం చేశారు.
రాత్రిపూట మంతనాలు..
మొదటి విడత ఎన్నికల ప్రచార పోరు ప్రారంభం కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి పగలు ప్రచారం చేస్తున్నారు. రాత్రి ఆయా గ్రామాల పెద్దలు, పటేళ్లు, కులపెద్దలు, నా యకులతో మంతనాలు జరుపుతున్నారు. విజయ మే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రముఖులను రంగంలోకి దించి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్లను సామాజిక వర్గాల వారీగా ఓటర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గె లుపోటములపై ప్రభావం చూపే వార్డులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు గ్రామ పెద్దలతో మంతనాలు జరుపుతూ సమయం చిక్కినప్పుడల్లా ఫోన్లు చేస్తున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ మద్దతు కోరుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, భవిష్యత్‌లో చేయనున్న అభివృద్ధిపై ప్రస్తావిస్తున్నారు. అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇస్తున్నారు.
పోరు రసవత్తరం..
పంచాయతీ పోరు రసవత్తరంగా సాగుతోంది. అత్యధిక గ్రామ పంచాయతీలు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ)లకు రిజర్వు కావడంతో గిరిజనేతరులు ఎస్టీలతో జతకట్టి గెలుపుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు అవకాశం లేకున్నా ఫర్వాలేదు.. కానీ నా అనే నాయకుడు గెలవాలనే ధీమాలో ఉన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో యువత ఓట్లు కూడా చాలా కీలకం కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్నడూలేనంతగా యువత ముందుకు వచ్చింది. పోటీలో ఎక్కువశాతం యువకులే ఉన్నారు.
మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలు, వార్డులు
మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు
కెరమెరి 31 111 118 222
వాంకిడి 28 88 124 383
జైనూర్ 26 104 55 109
లింగాపూర్ 14 42 45 85
సిర్పూర్(యు) 15 51 26 56
మొత్తం 114 396 368 855


