‘అరెస్టులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు’
ఆసిఫాబాద్‌అర్బన్: అక్రమ అరెస్టులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూప్‌నార్ రమేశ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుండడంతో తీవ్ర మనస్తాపం చెందిన బీసీ నాయకుడు ఈశ్వరాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. అతని ఆత్మహత్యకు నిరసనగా శనివారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం సరికాదన్నారు. ఈశ్వరాచారి ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామన్నారు. అరెస్టయిన వారిలో నాయకులు మారుతి, శంకర్, నారాయణ, బాలేష్, పురుషోత్తం, ప్రశాంత్, లహుకుమార్ రవికాంత్, నాందేవ్, తదితరులు ఉన్నారు.


