భారతీయ భాషల దినోత్సవం
కాగజ్‌నగర్‌టౌన్: తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి జయంతిని పురస్కరించుకుని శని వారం పట్టణంలోని జవహర్ నవోదయ వి ద్యాలయంలో భారతీయ భాషల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భాషలు ఎన్నయినా భావం ఒక్కటేనని, ప్రతీ విద్యార్థికి తన మాతృభాష తల్లితో సమానమన్నారు. మా తృభాషతో పాటు మరో ఐదు భాషలు నేర్చుకునే సామర్థ్యం మనలో పెరగాలన్నారు. అంతకుముందు విద్యార్థులు సృజనాత్మకంగా భాషావృక్షం అనే చిత్రపటాన్ని రూపొందించారు. అందులో ప్రధాన వృఽక్షాన్ని భారతదేశాన్ని సూచించేలా తీర్చిదిద్దారు. విద్యార్థులు పలు భాషల్లో కవితలు, పాటలు పాడి అలరించారు. ఈ కార్యక్రమంలో భాషా అధ్యాపకులు డాక్టర్ రామయ్య, హరిబాబు, ఉమేష్ కుమార్, రాజేందర్ నాయక్, మక్సూద్, నిరంజన మంజుల, విద్యార్థులు పాల్గొన్నారు.


