నూతన విత్తన చట్టంపై అవగాహన
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో శనివారం విత్తన డీలర్లకు నూతన విత్తన చట్టం–2025పై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ మాట్లాడుతూ ప్రస్తుత విత్తన చట్టం–1966తో పోల్చి కొత్త చట్టంలో అమలుకాబోయే మా ర్పులు, నియమ నిబంధనలు, డీలర్లు పాటించాల్సిన విధానాలను వివరించారు. కొత్త చట్టంపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ఈనెల 11లోగా జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం లేదా రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ సహాయ వ్యవసాయ అధికారులు మిలింద్ కుమార్, మనోహర్, మండల వ్యవసాయ అధికారులు, జిల్లాలోని విత్తన డీలర్లు పాల్గొన్నారు.


