ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
తిర్యాణి: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఏఎస్పీ చిత్తరంజాన్ అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని మార్కగూడ, మంగి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలన్నారు. అనంతరం అర్జున్‌లోద్ది గ్రామంలోని భీమన్న, పాండవుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటేశ్, ఏఆర్ ఎస్సై శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.


