ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో ఉపాధి
ఆసిఫాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూళన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో జాతీయ నిర్మాణ రంగ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లాకు చెందిన 23 మంది భవన నిర్మాణ కార్మికులకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ధ్రువపత్రాలు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు నైపుణ్యం ఉన్న కార్మికుల కొరత ఉందన్నారు. శిక్షణ ద్వారా నైపుణ్యం మెరుగుపర్చి, పనులను వేగవంతం చే యవచ్చన్నారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, గృహనిర్మాణ శాఖ పీడీ ప్రకాశ్‌రావు, అధికారులు పాల్గొన్నారు.


