ప్రస్తుత పరిస్థితి..
రైల్వే స్టేషన్‌లో మూడు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. మరుగుదొడ్లు లేవు, వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉంది. అయితే కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రైవేటు పార్కింగ్ స్థలాల్లో వాహనదారులు తమ వాహనాలను నిలుపుతున్నారు. అలాగే స్టేషన్‌కు ముందు, వెనుకవైపు నుంచి రెండు మార్గాలు ఉండగా.. మొదటి ప్లాట్‌ఫాంపై మాత్రమే టికెట్ కౌంటర్లు ఉన్నాయి. పట్టణం నుంచి వచ్చే ప్రయాణికులు ముందు మార్గం నుంచి వస్తుండగా దహెగాం, కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, బెజ్జూర్ మండలాలతో పాటు కాపువాడ ప్రయాణికులు వెనుకవైపు గల మార్గం నుంచి స్టేషన్‌కు వస్తారు. ఒకే ప్లాట్‌ఫాంపై టికెట్ కౌంటర్ ఉండడంతో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


