నూతన భవనం నిర్మించాలని వినతి
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి శిథిలావస్థకు చేరిందని, నూతన భవనాన్ని నిర్మించి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి సోమవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు వినతిపత్రం అందించారు. హైదరాబాద్‌లోని సచివా లయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలి శారు. శిథిలావస్థకు చేరిన ఈఎస్‌ఐ ఆస్పత్రిని కూల్చి కొత్త భవనం నిర్మించాలన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


