గిరిజనులతోనే బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: గిరిజన సంక్షేమ శాఖ పరి ధిలోని బ్యాక్‌లాగ్ పోస్టులను గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని తెలంగాణ ఆదివా సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. టీఏజీఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను కొన్నేళ్లుగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్నారని తెలి పారు. వీటిని ఏటా రెన్యువల్ చేస్తుండటంతో నోటిఫికేషన్ కోసం గిరిజనులకు ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, యువతకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చే శారు. కార్యక్రమంలో నైతం రాజు, సోంరాజ్, పాలక్‌రావు, కిరణ్ తదితరులు ఉన్నారు.


