పరిశీలించి.. పరిష్కారానికి ఆదేశించి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాలకు నుంచి వచ్చిన బాధితుల బాధలు విన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వృద్ధాప్య పింఛన్ అందించాలని ఆసిఫాబాద్ పట్టణంలోని సందీప్‌నగర్‌కు చెందిన షేక్ మున్నా కోరాడు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అటవీశాఖ నిబంధనలతో ఇబ్బంది పడుతున్నామని, సమస్య పరిష్కరించాలని సిర్పూర్(టి) మండలం పూసిగూడ గ్రామానికి చెందిన గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. తండ్రి పేరిట ఉన్న భూమిని తన పేరిట విరాసత్ చేయాలని రెబ్బెన మండలం గోలేటికి చెందిన దేవయ్య అర్జీ పెట్టుకున్నాడు. సిర్పూర్(టి) మండల కేంద్రానికి చెందిన దుర్గం నిర్మల, కాగజ్‌నగర్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన పర్వీన్ సుల్తానా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. సిర్పూర్(టి) మండలం పారిగాంకు చెందిన కారుబాయి తన భర్త మరణించినందున డెత్ సర్టిఫికెట్ జారీ చేయాలని విన్నవించింది. సాగు భూమికి పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాలని రెబ్బెన మండలం నంబాలకు చెందిన పెద్దపల్లి లక్ష్మి అర్జీ అందించింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
గుడిసెల్లో ఉంటున్నాం.. ఇళ్లు మంజూరు చేయండి
ప్రస్తుతం మేమంతా కూలీ పనులు చేసుకుంటూ చిన్నచిన్న గుడిసెల్లో ఉంటున్నాం. ఇళ్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయి. మాలాంటి పేదలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉండేందుకు సరైన నివాసాలు లేక ఇబ్బంది పడుతున్నాం. కలెక్టర్ స్పందించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదలకు అండగా నిలవాలి.
– జక్కులపల్లి మహిళలు, రెబ్బెన మండలం
పరిశీలించి.. పరిష్కారానికి ఆదేశించి


