వందేమాతరంతో ప్రజల్లో చైతన్యం
కాగజ్‌నగర్‌టౌన్: స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో వందేమాతరం గీతం ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం కాగజ్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ చౌరస్తా, మార్కెట్ ఏరియాల్లో సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో వందేమాతరం ప్రజల్లో స్ఫూర్తి నింపిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు శివకుమార్, అశోక్, అరుణ్ లోయ, అనిల్, చారి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


