మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రభుత్వం ప్రకటించిన విధంగా సోయాబీన్ క్వింటాల్‌కు రూ.5,328 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. జైనూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ దళారులు, వ్యాపారులను నమ్మి మోసపోకుండా రైతులకు ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హన్ను పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


