‘దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలి’
ఆసిఫాబాద్: రానున్న 25 ఏళ్లలో భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రచార కల్పగురి ప్రభుకుమార్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని జైన్‌మందిర్ నుంచి సాయిబాబా మందిర్ వరకు పథసంచలన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ సమాజ సంఘటనే దేశ అభ్యున్నతికి మార్గమన్నారు. డిసెంబర్‌లో జరగనున్న వారాట్ హిందూ సమ్మేళనానికి ప్రజలు తరలిరావాలన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ విభాగ్ సహా కార్యవాహ మాధవరపు రంగస్వామి, మంచిర్యాల జిల్లా కార్యవాహ కృష్ణ భాస్కర్, గౌతం చంద్ లోఢా, కొత్తపల్లి శ్రీనివాస్, నాగేశ్వర్‌రావు, మల్లికార్జున్, సతీశ్‌బాబు, విశాల్, కోటేశ్వర్‌రావు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


