రాజీమార్గంలోనే సమస్యలు పరిష్కారం
సిర్పూర్(టీ): కక్షిదారులు రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకుని డబ్బు, సమయం ఆదా చేసుకో వాలని జూనియర్ సివిల్ కోర్టు మెజిస్ట్రేట్ అజయ్ ఉల్లం సూచించారు. శనివారం మండల కేంద్రంలో ని జూనియర్ సివిల్ కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కక్షిదారులు క్షణికావేశాలకు పోయి తమ విలు వైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించా రు. ఇరువర్గాలు రాజీపడి కేసులు పరిష్కరించుకో వడం ఉత్తమమని పేర్కొన్నారు. అనంతరం సిర్పూర్(టీ) కోర్టు పరిధిలోని కాగజ్‌నగర్, కాగజ్‌నగర్‌టౌ న్, కాగజ్‌నగర్ రూరల్, ఈజ్‌గాం, సిర్పూర్(టీ), కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహెగాం మండలాల పోలీస్‌స్టేషన్ల పరి ధిలోని 247 కేసులు పరిష్కరించారు. న్యాయవాదులు వజ్జల కిశోర్‌కుమార్, పీ సతీశ్‌కుమార్, గంట కళ్యాణ్, అబ్దుల్ మతిన్ తదితరులు పాల్గొన్నారు.


