క్రీడలతో మానసిక వికాసం
ఆసిఫాబాద్‌అర్బన్: క్రీడలు మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వాసవీ గార్డెన్స్‌లో అర్జున్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో తాటిపల్లి గోపాలకృష్ణ జ్ఞాపకార్థం నిర్వహించిన 33వ రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ ప్రైజ్ మనీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ ఓటమి భవిష్యత్ విజయానికి నాంది అని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి చెస్ ఆడి వారిని అభినందించారు. కార్యక్ర మంలో సుధాకర్, గడ్డాల శ్రీనివాస్, కరుణాకర్‌రె డ్డి, గోపాలకృష్ణ, స్వరూప తదితరులున్నారు.
విద్యార్థులతో చెస్ ఆడుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి


